- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Social Justice Day : ఫిబ్రవరి 4న "తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం"
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం, సాధికారత సూత్రాలను సమర్థించడంలో తన అంకితభావాన్ని పునరుద్ఘాటించడానికి ఇకపై ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన "తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం"(Telangana Social Justice Day)గా ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Shanthi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతను గుర్తించిందని ఆమె తెలిపారు. కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2024 ఫిబ్రవరి 4న కులగణన(Cast Census) చేయాలని క్యాబినెట్లో తీర్మాణం చేశారు.
2025 ఫిబ్రవరి 4న అసెంబ్లీలో బీసీ కులగణన(Assembly BC Cast Census)కు సంబంధించిన చర్చించారు. వివరాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న తెలంగాణలో సామాజిక న్యాయ దినోత్సవం జరపనున్నట్లుగా గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రధానంగా ఈ ఏడాది ఫిబ్రవరి 4న సామాజిక-ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులాల సర్వేకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా, షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించిన సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడం జరిగిందన్నారు. సామాజిక న్యాయంపై తెలంగాణ నిబద్ధతను తెలిపేందుకు అధికారికంగా వేడుకలు, అవగాహన కార్యక్రమాలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
అలాగే గుర్తింపు అవార్డులు, సంక్షేమ శిబిరాలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు సైతం చేపట్టడం జరుగుతుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఈ కార్యకలాపాల సమన్వయం, అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉండి, ప్రభుత్వంలోని అన్ని సంక్షేమ శాఖలతో నిర్వహించడం జరుగుతుందన్నారు. తద్వారా అన్ని సంబంధిత శాఖలు ఈ ఉత్తర్వును అమలుకు అవసరమైన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎస్శాంతికుమారి ఆదేశించారు.






