- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్న కొడుకులను బిస్కెట్‌లో విషం కలిపి చంపాలని తండ్రి సుపారీ.. రెండో భార్యతో కలిసి వేసిన ప్లాన్ రివర్స్
ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలని చూసిన తండ్రి అడ్డంగా దొరికిపోయాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి ఆస్తి కోసం రాక్షసుడిలా మారాడు. సుపారీ ఇచ్చి సొంత బిడ్డలను చంపేందుకు పథకం రచించాడు. బిస్కెట్‍లో విషయం కలిపి చంపాలని ప్రణాళిక వేసి చివరి నిమిషంలో అడ్డంగా దొరికిపోయాడు. జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లి (Raghunathapally) మండలం పొట్టిగుబ్బతండాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బానోతు శ్రీనివాస్‍కు అనిత అనే మహిళతో 2016లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీనివాస్ మూడవత్ మమత అనే మరో మహిళను వివాహమాడాడు. అయితే మొదటి భార్య పిల్లల పేరున 20 గుంటల భూమి ఉండటాన్ని తండ్రి శ్రీనివాస్ జీర్ణించుకోలేకపోయాడు. ఆ ఆస్తిని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలనే కుట్రతో తన రెండో భార్య మమతతో కలిసి పన్నాగం వేశాడు. తన కుమారులకు బిస్కెట్‍లో విషయం కలిపి ఇచ్చి చంపేందుకు ప్లాన్ వేశారు. ఇందుకోసం అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి సుపారీ సైతం ఇచ్చారు.
భయంతో విషయం బయటకు:
పిల్లలిద్దరినీ చంపేందుకు సుపారీ తీసుకున్న వ్యక్తి తొలుత అంగీకరించినప్పటికీ ఆ తర్వాత భయపడిపోయాడు. దాంతో జరిగిన విషయం అంతా గ్రామస్తులకు తెలిపాడు. అతడి మాటలు విని నివ్వెరపోయిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీనివాస్ అతడి రెండో భార్యను అదుపులోకి తీసుకుని జనగామ కోర్టులో హాజరుపరచగా కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. సుపారీ తీసుకున్న వ్యక్తి భయం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు పోకుండా ఆపగలిగిందని లేదంటే ఈ పాటికి గ్రామంలో తీరని విషాదం జరిగేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






