Father Kills Son: తనకు పుట్టలేదన్న అనుమానంతో కొడుకును హత్య చేసిన తండ్రి!

by Ramesh Naini |   (  Updated:2025-12-21 13:42:38  IST  )

మెదక్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Father Kills Son: తనకు పుట్టలేదన్న అనుమానంతో కొడుకును హత్య చేసిన తండ్రి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెదక్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు పుట్టలేదన్న అనుమానంతో తండ్రే మూడేళ్ల కుమారుడిని హత్య చేసిన సంఘటన మెదక్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం పెద్దబాయి తండాకు చెందిన భాస్కర్‌కు తిమ్మక్కపల్లి తండాకు చెందిన మహిళతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఇటీవల భర్త తనను కొట్టాడని, కుమారుడిని అతని వద్దే వదిలి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రెండు రోజులుగా బాలుడు తండ్రి వద్దే ఉన్నాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన భాస్కర్‌.. బాలుడు తనకు పుట్టలేదన్న అనుమానంతో తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న మెదక్ గ్రామీణ ప్రాంత పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.

Next Story