జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన బస్సు డ్రైవర్‌

by Yella Dhawani Reddy |

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన బస్సు డ్రైవర్‌
X

దిశ, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఎల్లారెడ్డిగూడెం వద్ద ఓ రెడీమిక్స్‌ లారీను వేగంగా వస్తున్న డబుల్‌ డెక్కర్‌ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన బస్సు డ్రైవర్‌ను స్థానికులు కాసేపు శ్రమించి బయటకు తీశారు. ఆయనను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వాహనాలు రెండు రోడ్డుపై పడిపోవటంతో ట్రాఫిక్‌‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ల సాయంతో పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Next Story