- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road Accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన కుటుంబం సజీవ దహనం
అమెరికా(America)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో తెలంగాణ(Telangana)కు చెందిన కుటుంబం సజీవ దహనం(Burned Alive) అయింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో తెలంగాణ(Telangana)కు చెందిన కుటుంబం సజీవ దహనం(Burned Alive) అయింది. హైదరాబాద్(Hyderabad)కు చెందిన తేజస్విని, శ్రీ వెంకట్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెకేషన్ కోసం అమెరికాలోని డల్లాస్(Dallas)లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో టెక్సాస్‌లోని డల్లాస్ సమీపంలో జరిగిన ప్రమాదంలో నలుగురూ సజీవ దహనం అయ్యారు. అట్లాంటాలోని బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి డల్లాస్ కు తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్నవాహనాన్ని వేగంగా వస్తున్న ఒక ట్రక్ ఢీకొనడంతో కారు మంటల్లో చిక్కుకుని నలుగురూ అందులోనే మరణించారు.
ఈ ఘటనలో శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో అధికారులు DNA ఫింగర్‌ప్రింటింగ్ ద్వారా వారిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. స్థానిక పోలీసుల ప్రకారం, ఈ ప్రమాదం ట్రక్ డ్రైవర్ తప్పిదం కారణంగా జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కొంపల్లిలో వారి కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర శోకంలో ముంచెత్తింది.






