- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం
by GSrikanth |
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం దొంతిగూడెంలోని ఎస్వీఆర్ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం దొంతిగూడెంలోని ఎస్వీఆర్ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం కార్మికులు సొల్వెంట్‌ను రీసైకిల్ చేస్తుండగా రియాక్టర్ పెద్ద శబ్ధంతో పేలి మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో అక్కడే పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు మంటలు అంటుకొని తీవ్ర కాలిన గాయలయ్యాయి. పోలీసులు వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
Next Story






