రైతుల సంక్షేమమే ధ్యేయం : Revanth Reddy

by Taduka Kalyani |   (  Updated:2026-01-16 12:58:23  IST  )

రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రైతును రాజు చేయలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

రైతుల సంక్షేమమే ధ్యేయం : Revanth Reddy
X

దిశ,ఆదిలాబాద్ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రైతును రాజు చేయలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని హత్తిఘాట్ వద్ద చనాక కోరాట ఎత్తపోతల పథకాన్ని సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా హెలిపాడ్ నుంచి కాన్వయ్ ద్వారా పంప్ హౌజ్ కు చేరుకున్న సీఎం కు ప్రాజెక్టు వివరాలను కలెక్టర్ రాజర్షి షా.. నీటిపారుదల శాఖ అధికారులు తెలియజేశారు. అనంతరం ప్రాజెక్టుకు పూజలు చేసి నీటిలో పువ్వులను వేసి గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం ఎగువ నుంచి వస్తున్న పెన్ గంగా ప్రవాహం, సాగు నీటి లభ్యత తదితర వాటిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు స్వీచ్ నొక్కి ప్రారంభించి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. ఎమ్మెల్సీ దండే విఠల్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల శంకర్, అనిల్ జాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, అడే గజేందర్ ఎస్పీ అఖిల్ మహాజన్, అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story