- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక వైపు యూరియా కొరత.. మరోవైపు వణ్యప్రాణులు.. రైతన్నల బాధ వర్ణనాతీతం
పంటలను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న బాధలు అన్నీఇన్నీకావు. ఒకవైపు యూరియా బస్తాల కోసం తిండి తిప్పలు మాని తెల్లవారుజామునుంచే క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నా సంఘటనలు మనం చూస్తేనే ఉన్నాం.

దిశ, కోనారావుపేట : పంటలను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న బాధలు అన్నీఇన్నీకావు. ఒకవైపు యూరియా బస్తాల కోసం తిండి తిప్పలు మాని తెల్లవారుజామునుంచే క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నా సంఘటనలు మనం చూస్తేనే ఉన్నాం. ఇవి చాలవన్నట్లు పంట పొలాలపై వన్యప్రాణుల బెడద రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు రైతున్నలకు అడుగడుగునా అగచాట్లే ఎదురవుతున్నాయి. ఒక వైపు రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు అవస్థలు పడుతుంటే మరో వైపు వన్యప్రాణుల బెడదతో చేతికొచ్చిన పంట పొలాలు కాస్త నాశనమవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మండలంలోని మరిమడ్ల, గొల్లపల్లి, కోనరావుపేట, వెంకట్రావుపేట, శివంగలపల్లె, ఎగ్లాస్పూర్, వట్టిమల్ల గ్రామాల్లో కోతులు, అడవి పందుల బెడదా రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ గ్రామాలు అటవీ ప్రాంతానికి చేరువుగా ఉండేసరికి పంటపొలాల్లోనే కాకుండా ఇండ్లల్లో కూడా గుంపులు గుంపులుగా చేరి గ్రామస్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పొట్ట దశలో ఉన్న వరి పంటను పూర్తిగా చీల్చి తీవ్ర నష్టం కలిగిస్తుండటంతో రైతులు పంట రక్షణకోసం పొద్దంతా పొలాల దగ్గరే కాపలా ఉండే పరిస్థితి నెలకొంది. కష్టం మొత్తం కండ్ల ముందే నాశనం అవుతుంటే రైతన్నలు లబోదిబోమంటున్నారు.






