- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకృతి సిద్ద వ్యవసాయానికి రైతులు మొగ్గు చూపాలి : ఎంపీ ఈటెల
దేశ ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాత వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చేసుకొచ్చి రైతులకు వెనుదన్నుగా నిలిచారని ఎంపీ ఈటెల రాజేందర్పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాత వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చేసుకొచ్చి రైతులకు వెనుదన్నుగా నిలిచారని ఎంపీ ఈటెల రాజేందర్పేర్కొన్నారు. ఆదివారం 128 వ మన్ కీ బాత్ ముగిసిన తరువాత మాట్లాడుతూ అన్ని రంగాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందుతుందని మోడీ బావించినట్లు తెలిపారు.
వారు ఆశించినట్లు వ్యవసాయంలో మార్పు తీసుకుని వచ్చి అనారోగ్యం దరిచేరని విధంగా మన రైతులు పంటలు పండిస్తారని పేర్కొన్నారు. అన్ని రంగాల గురించి ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన పలు విషయాలను ప్రస్తావిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు తీసుకున్నట్లు చెప్పారు. అన్ని రంగాల్లో ఉన్న నిష్ణాతులను దేశానికి పరిచయం చేస్తున్నారని, ఒకప్పుడు మన దేశంలో ఇంత ఎరువులు, క్రిమి సంహారకాల వాడకం ఉండేది కాదు. ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసేవారు.
ప్రస్తుతం ఉత్పత్తి పెంచడం కోసం భూమిని విషతుల్యం చేస్తున్నాం, క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. దీంతో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నుండి బయటపడటానికి ప్రకృతి సిద్ధ వ్యవసాయం చేద్దామని ప్రధాని పిలుపునిచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది నిజం చేయాలని కోరారు. మనిషిలో మార్పు వస్తుందిని ఎథిక్స్, విలువలు, సంప్రదాయాల గురించి ఆలోచన చేస్తున్నారు. భారత దేశ ఔన్నత్యాన్ని పెంచుతున్న మోడీ కృషి అభినందనీయమన్నారు.






