యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు

by Elthuri vijay kumar |

తెలంగాణకు సరిపడా యూరియా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం, యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని, ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు
X

యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు

- తెలంగాణకు సరిపడా యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశాం

- ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం

- సైదాపూర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

దిశ,సైదాపూర్ : తెలంగాణకు సరిపడా యూరియా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం, యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని, ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో కేజీబీవి పాఠశాలలో 90 లక్షలతో డార్మెంటరీ హాల్, భవన మరమ్మత్తులు, మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన, రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు. అలాగే వేంకటేశ్వర్లపల్లి గ్రామంలో రూ.5 లక్షలతో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ ప్రారంభించారు. సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని బూడిదపల్లి గ్రామంలో రూ.5 లక్షలతో ఓపెన్ జిమ్ ప్రారంభించారు. రూ.12 లక్షలతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు. ఎక్లాస్పూర్ రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story