- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూరియా కోసం బారులు తీరిన రైతులు.. పొన్నం ప్రభాకర్ కీలక హామీ
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే రైతులంతా యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాల వద్ద క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. తెల్లవారింది మొదలు యూరియా కోసం చాలా చోట్ల చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట (Akkannapet) మండల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minster Ponnam Prabhakar) శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
అయితే, అక్కన్నపేట విశాల పరపతి సహకార సంఘం ఎదుట యూరియా కోసం క్యూ కట్టిన రైతులతో పొన్నం మాట్లాడి వారికి కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. కానీ, ఆ విషయం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని కామెంట్ చేశారు. అయినప్పటికీ ఎరువులు, యూరియాపై కేంద్ర వ్యవవసాయ శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడారని తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రానికి పూర్తి స్థాయిలో యూరియా స్టాక్ రాబోతోందని.. రాష్ట్రంలో చివరి రైతుకు కూడా పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.






