- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gandhi Bhavan: గాంధీ భవన్ మెట్ల మీద రైతు ధర్నా.. ఎందుకంటే?
by Ramesh Naini |
గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు నిరసన వ్యక్తం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ (Gandhi Bhavan) మెట్ల మీద వృద్ధ రైతు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తనకు రైతు రుణమాఫీ (loan waiver) చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీభవన్ వద్ద తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం, అంబర్‌పేట్ గ్రామానికి చెందిన తోట యాదగిరి మెట్లపై కూర్చోని ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, తనకు మాత్రం రుణమాఫీ కాలేదని తెలిపారు. తనకు రూ.3 లక్షలకు పైగా క్రాప్‌లోన్ ఉన్నదని, కానీ రుణమాఫీ కాలేదన్నారు. మరోవైపు తనకు ఎలాంటి పింఛన్, ప్రభుత్వ సాయం, వడ్ల బోనస్ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






