- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో వానలకు పెద్ద మొత్తంలో పంట నష్టం : రైతు నేత పాకాల శ్రీహరి
రాష్ట్రంలో కురుస్తున్న వానలతో 45 లక్షల ఎకరాలకు పైగా ప్రత్తి, 3.50 లక్షల ఎకరాల పైగా సోయా పంటకు నష్టం జరిగిందని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కురుస్తున్న వానలతో 45 లక్షల ఎకరాలకు పైగా ప్రత్తి, 3.50 లక్షల ఎకరాల పైగా సోయా పంటకు నష్టం (Crop damage) జరిగిందని, దీంతో రైతులు సగం దిగుమతి రాదని భయాందోళనకు గురి అవుతున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు (Pakala Srihari Rao) ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పంట నష్టం జరిగినప్పుడు పరిహారం కోసం ఎవరి దయ దాక్షిణ్యాల పైన ఆధారపడకుండా రైతుకు రక్షణ కవచంగా ఉండే పంట బీమా పథకం అమలు చేస్తే ఎంతో బాగుండేదన్నారు. ఒక్క పంట నష్టం జరిగినప్పుడు, తర్వాత పంట పండించి అది చేతికి వచ్చే వరకు రైతు ఇల్లు గడవడానికి అప్పు కోసం అనేక అవస్థలు పడుతారని పేర్కొన్నారు.
రైతుల ఆర్థిక, సామాజిక రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని సూచించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలను వెంటనే ప్రకటించాలని డిమాండ్చేశారు. ప్రైవేట్ అప్పుల అధిక వడ్డీకి బలి కాకుండా, బ్యాంకుల నుంచి రైతులకు ఇల్లు గడవడానికి వచ్చే సీజన్లో పంట వేయడానికి అవసరమైన ఖర్చులకు రుణాలు ఇప్పించాలని కోరారు. రబీలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలని, అదే విధంగా పంట బీమా పథకం అమలు చేయాలని సూచించారు.






