- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lagacharla : లగచర్లలో ఇండస్ట్రీయల్ పార్క్ కు స్వచ్చందంగా రైతుల భూములు
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్ల(Lagacharla)గ్రామంలో ఇండస్ట్రీయల్ పార్క్(Industrial Park)నిర్మాణానికి భూములిచ్చేందుకు రైతులు స్వచ్చందంగా ముందుకు రావడం చర్చనీయాంశమైంది.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్ల(Lagacharla)గ్రామంలో ఇండస్ట్రీయల్ పార్క్(Industrial Park)నిర్మాణానికి భూములిచ్చేందుకు రైతులు స్వచ్చందంగా ముందుకు రావడం చర్చనీయాంశమైంది. లగచర్ల లోని సర్వే నెంబర్ 101 లో ఉన్న 100 ఎకరాల భూమిని 22 మంది రైతులు ప్రభుత్వానికి స్వచ్చందంగా అందించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పరిహారంపై నచ్చడంతో స్వచ్చందంగా తమ భూములిస్తున్నట్లుగా లగచర్ల రైతులు చెబుతున్నారు.
కాగా ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణానికి స్వచ్చందంగా ముందుకొచ్చి తమ భూములను ఇచ్చిన లగచర్ల రైతులను కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Prateek Jain) సన్మానించి వారికి ఒకే దఫాలో మొత్తం నష్టపరిహార చెక్కుల(Compensation checks)ను అందచేశారు.
కాగా ఇదే దుద్యాల మండలం లగచర్లలో తెలంగాణ ఇండ్రస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) కోసం భూసేకరణకు సంబంధించి లగచర్ల శివారులో నవంబర్ 11న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి సహా అధికారులపై గ్రామ రైతులు దాడికి దిగిన ఘటన సంచలనంగా మారింది.
భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ అధికారులపై కర్రలు, రాళ్లతో దాడిచేసి హత్య చేసేందుకు ప్రయత్నించి.. అధికారులపై దాడి చేయడం, వారి విధులకు ఆటంకం కలిగించడం, అల్లర్లు సృష్టించడం వంటి ఘటనలకు సంబంధించి 46 మంది రైతులపై హత్యాయత్నంతో పాటు ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 24మందిని రిమాండ్ చేశారు.
అంతటి వివాదం చోటుచేసుకున్న ఇదే లగచర్లలో ఇప్పుడు రైతులు ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణానికి భూములిచ్చేందుకు రైతులు స్వచ్చందంగా ముందుకు రావడం ఆసక్తికర పరిణామం.






