Harish Rao : రైతుల చేతులకు సంకెళ్ళు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం : హరీష్ రావు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-18 11:05:02  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao : రైతుల చేతులకు సంకెళ్ళు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ(Dhanvada Ethonal Factory)కి వ్యతిరేకంగా పోరాడిన రైతులను అరెస్టు చేయడమే కాకుండా నేరస్తుల లాగ రైతులకు చేతులకు సంకెళ్ళు(Farmers are in Handcuffs) వేయడం ఏమిటని మండిపడ్డారు. లగచర్ల నుంచి రాజోలి దాకా ఇలాంటి ఘటనలే పునరావృత్తం అవుతున్నాయని అన్నారు. రైతు చేతులకు సంకెళ్లు వేయడం, పౌర హక్కుల నేతలపై నిర్బంధాలు విధించడం.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గారూ ఇవేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఆనవాళ్ళు అంటూ ప్రశ్నించారు.

పెద్ద ధన్వాడలో గత కొన్ని నెలలుగా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అనేక గ్రామాల ప్రజలపై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. రైతులకు సీఎం భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే అన్నదాతలే రేవంత్ కు గట్టిగా బుద్ధి చెబుతారని హరీష్ రావు అన్నారు.

Read More... ధ‌న్వాడ‌ రైతుల చేతుల‌కు సంకెళ్లు వేయ‌డం దుర్మార్గం: కేటీఆర్

Next Story