- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : రైతులకు బేడీలు.. రైతు కమిషన్ సీరియస్
పెద్ద ధన్వాడ(Dhanwada)లో రైతులకు సంకెళ్ళు(Farmers are in Cuffs) వేసియం ఘటనపై తెలంగాణ రైతు కమిషన్(Raithu Commission) సీరియస్ అయ్యింది.

దిశ, వెబ్ డెస్క్ : పెద్ద ధన్వాడ(Dhanwada)లో రైతులకు సంకెళ్ళు(Farmers are in Cuffs) వేసియం ఘటనపై తెలంగాణ రైతు కమిషన్(Raithu Commission) సీరియస్ అయ్యింది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethonal Factory) ఏర్పాటుకు వ్యతిరేకంగా జూన్ 4న రైతులు నిరసన వ్యక్తం చేసి, విధ్వంసం సృష్టించారనే ఆరోపణలతో 12 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అలంపూర్ కోర్టుకు హాజరుపర్చే సమయంలో సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతు సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ఈ ఘటనపై రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి(Kodanda Reddy) జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావుకు ఫోన్ చేసి మండిపడ్డారు. రైతులకు బేడీలు వేయడం అమానవీయ చర్య అని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామని, ఒక ఆర్‌ఎస్‌ఐ, ఇద్దరు ఏఆర్‌ఎస్‌ఐలను సస్పెండ్ చేశామని ఎస్పీ శ్రీనివాసరావు కమిషన్ ఛైర్మన్ కు వివరణ ఇచ్చారు.






