జాతీయ వ్యవ‌సాయ‌ ప‌రిశోధ‌న సంస్థల‌ను ప్రభుత్వం వినియోగించుకోవాలి : రైతు క‌మిష‌న్ చైర్మన్ కోదండరెడ్డి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-23 15:54:02  IST  )

జాతీయ వ్యవ‌సాయ‌ ప‌రిశోధ‌న సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం స‌రిగ్గా వినియోగించుకుని రైతులు నాణ్యమైన పంటలు పండించేలా చూడాలని రైతు కమిషన్​చైర్మన్​కోదండరెడ్డి పేర్కొన్నారు. రైతుల‌కు, వ్యవ‌సాయ అధికారుల‌కు అనేక ర‌కాల శిక్షణ కార్యక్రమాలు ఈ ప‌రిశోధ‌న కేంద్రంలో ఇస్తున్నట్లు తెలిపారు.

జాతీయ వ్యవ‌సాయ‌ ప‌రిశోధ‌న సంస్థల‌ను ప్రభుత్వం వినియోగించుకోవాలి : రైతు క‌మిష‌న్ చైర్మన్ కోదండరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : జాతీయ వ్యవ‌సాయ‌ ప‌రిశోధ‌న సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం స‌రిగ్గా వినియోగించుకుని రైతులు నాణ్యమైన పంటలు పండించేలా చూడాలని రైతు కమిషన్ ​చైర్మన్​ కోదండరెడ్డి పేర్కొన్నారు. రైతుల‌కు, వ్యవ‌సాయ అధికారుల‌కు అనేక ర‌కాల శిక్షణ కార్యక్రమాలు ఈ ప‌రిశోధ‌న కేంద్రంలో ఇస్తున్నట్లు తెలిపారు. మంగళవారం రైతు క‌మిష‌న్ స‌భ్యులు, అధికారుల‌తో క‌లిసి ఇండియ‌న్ ఇనిస్ట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంట‌ర్ తోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ ప‌రిశోధ‌న సంస్థల‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు యూరియా వాడ‌కం త‌గ్గించాల‌ని న‌కిలీ విత్తనాలు, న‌కిలీ పురుగు మందులతో రైతులు తీవ్ర న‌ష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప‌రిశోధ‌న సంస్థలో ప‌నిచేస్తున్న శాస్త్రవేత్తలు, అధికారులు తెలంగాణ రైతుల‌కు అవ‌గాహాన క‌ల్పించే ప్రయ‌త్నం చేయాల‌ని సూచించారు. స్వతంత్ర ప్రతిపత్తి క‌లిగిన‌ నేషనల్​ఇనిస్టూట్​ఆప్​ప్లాంట్​హెల్త్​మేనేజ్​మెంట్ సంస్థలో చేస్తున్న ప‌రిశోధ‌న‌లు, శిక్షణ కార్యక్రమాల‌ను రైతు క‌మిష‌న్ ప‌రిశీలించి రైతాంగానికి రాజేంద్ర న‌గ‌ర్ లోని జాతీయ వ్యవ‌సాయ ప‌రిశోధ‌న సంస్థలు ఉప‌యోగ‌కంగా ఉండాల‌న్నారు. ప్రసార మాధ్యమాలో వ‌చ్చే యాడ్స్ చూసి రైతులు న‌కిలీ విత్తనాలు, న‌కిలీ ఎరువులు, పురుగు మందులు కోనుగోలు చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో రైతు క‌మిష‌న్ స‌భ్యులు గోపాల్ రెడ్డి, గ‌డుగు గంగాధ‌ర్, చెవిటి వెంక‌న్న యాద‌వ్, మెంబ‌ర్ సెక్రెట‌రీ గోపాల్, భార‌తీయ వ‌రి ప‌రిశోధ‌న సంస్థ డైరెక్టర్ ఆర్ ఎం సుంద‌రం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story