- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గత ప్రభుత్వం నిలిపేసిన కేంద్ర పథకాలను పునరుద్ధరిస్తున్నాం: మంత్రి తుమ్మల
రైతులకు నూతన సంవత్సరం కానుకగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులకు నూతన సంవత్సరం కానుకగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒక్కొక్కటిగా మా ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని, ఇప్పటికే జాతీయ ఆహర భద్రత మిషన్ లో భాగంగా పప్పుదినుసుల విత్తనాలను సబ్సిడీపై అందించడం జరిగిందని గుర్తుచేశారు. తాజాగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు, ఈ పథకంలో భాగంగా 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై వివిధ పనిముట్లు అందచేయనున్నట్లు తెలిపారు. రైతు యాంత్రీకరణ పథకం కింద ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జనవరి నెలలోగా ఈ ప్రక్రియను పూర్తిచేసి, రైతులకు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు.
జిల్లా అధికారులు జనవరి మొదటి వారంలో మండలాల వారిగా పర్యటించి, రైతులకు అందుతున్న సబ్సిడీలు, యాంత్రీకరణ పథకం దరఖాస్తులు, యూరియా యాప్ అమలు అంశాలపై క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ సేకరించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఒక్క పైసాను కూడా వృధా చేయకూడదనే ఆలోచనతో ఉన్నారని, అందుకోసం స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఎప్పటికప్పుడు విడుదల చేసేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మేరకు ఇప్పటికే కేంద్ర పథకాల కోసం స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసి రూ. 400 కోట్లను వినియోగించడం జరిగిందన్నారు. ఆయిల్ పామ్ వంటి దీర్ఘకాలిక ఆదాయం ఇచ్చే పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రైతులకు సబ్సిడీలు అందిస్తూ, ఆయిల్ పామ్ పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. యూరియా యాప్‌పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ఇప్పటికే ఐదు జిల్లాల్లో యూరియా యాప్ సమర్థవంతంగా అమలవుతోందని, రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మాటలతో యాప్ అమలులో లేని జిల్లాలలోని రైతులు ఎక్కువగా యూరియా కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని, యాప్ ద్వారా కూడా రైతులు తమకు కావాల్సినంత యూరియాను కొనుగోలు చేయవచ్చని, ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని కోరారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా యాప్ ను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
భరోసా కోసం శాటిలైట్ఇమేజ్మ్యాపింగ్త్వరగా పూర్తి చేయాలి :
రబీ సీజన్ రైతుభరోసా కోసం శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ను త్వరితగతిన పూర్తి చేసి, రైతుభరోసా నిధులు త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను రైతులకు వివరించి, దీర్ఘకాలికంగా మట్టిసారాన్ని కాపాడుతూ ఖర్చులు తగ్గించే విధానాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అండగా నిలిచేలా అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.






