- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PC Ghosh Commission: పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరైన మాజీ ఈఎన్సీ మురళీధర్
by Prasad Jukanti |
కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏంటి? అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ ను ప్రశ్నించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ నేటి నుంచి బహిరంగ విచారణ చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో జరిగిన విచారణకు మాజీ ఈఎన్సీ మురళీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీధర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. గతంలో మురళీధర్ సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా విచారణ చేపట్టారు. ప్రశ్నలు, సమాధానాలను వెంటనే కమిషన్ చీఫ్ నోట్ చేసుకుంటున్నారు. అంతకు ముందు విచారణలో అన్ని నిజాలే చెబుతానని మురళీధర్‌తో కమిషన్ చీఫ్ దేవుడిపై ప్రమాణం చేయించినట్లు సమాచారం. అనంతరం ఈఎన్సీగా కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏంటి? డీపీఆర్‌ను ఎవరు సిద్ధం చేశారని పలు ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తున్నది.
Next Story






