- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ మాట ప్రకారం రైతు కమిషన్ ఏర్పాటు: చైర్మన్ కోదండ రెడ్డి
కాంగ్రెస్ ప్రతి పక్షంలో ఉన్నపుడు అధికారంలోకి వస్తే వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ వేస్తామని హామీ ఇవ్వడంతో మెజారిటీ రైతులు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రతి పక్షంలో ఉన్నపుడు అధికారంలోకి వస్తే వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ వేస్తామని హామీ ఇవ్వడంతో మెజారిటీ రైతులు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకుందని, తాము చాలా జాగ్రతగా ఆలోచన చేసి క్షేత్ర స్థాయిలో పర్యటన చేసినట్లు తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రైతుకు విత్తనం చాలా ముఖ్యమైదని, విత్తనం కంపెనీలా గుప్పెట్లో పెట్టుకున్నాయన్నారు.
ములుగు విత్తనం అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విత్తనం చట్టం అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మరికొన్ని రోజుల్లో విత్తనం చట్టం రాబోతుందని స్పష్టం చేశారు. భూమి అంశం కూడా చాలా ముఖ్యమైనదని, భూమి హక్కు పత్రాలు లేక చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు. సమగ్రమైన భూభారతి చట్టం తీసుకొచ్చి వేగంగా భూ సమస్యలు పరిష్కారం చేస్తున్నామన్నారు.
గ్రామీణ వ్యవసాయంలో మైనర్ ఇరిగేషన్ ప్రదానమైనదని కమిషన్ నిష్ణాతుల చేత చర్చలు చేసి ఇరిగేషన్ మంత్రి కి అన్ని వివరాలు చెప్పామని తొందరలోనే మైనర్ నీటి వ్యవస్థను ఏర్పాటు జరుగుతుందన్నారు. మనీ లేండింగ్ తో చిన్న సన్న కారు రైతులను ప్రైవేట్ వ్యాపారస్తుల చేత చాలా మంది నష్టపోతున్నారు. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మనీ లేండింగ్ కట్టడి చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. బత్తాయి రైతులు తెగుళ్ల తో చేతికి వచ్చిన పంట నేలపాలు అవుతుంది మంచి మొక్క, అందిస్తే రైతులకు మేలు జరుగుందన్నారు.






