- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోయాబీన్ పంట కొనడంలేదని కన్నీరు పెట్టుకున్న రైతన్న !
మార్కెట్ యార్డ్ కు వచ్చినప్పటికీ పంటను మాత్రం అధికారులు కొనడం లేదట. అతిగా మాయిశ్చర్ ఉందని, ఇతర కారణాలు చెప్పి

దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. వాళ్లు పండించిన సోయా పంటను అమ్ముకునేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాలలో సోయాబీన్ క్వింటాల్ కు మద్దతు ధర రూ. 5328 కొనసాగుతోంది. నిబంధన ప్రకారం తేమశాతం ఉండేలా పంటలో చెత్తా, చెదారం లేకుండా సోయా పంటను వాహనాలలో మార్కెట్ యార్డ్ కు తీసుకొస్తున్నారు రైతులు.
అలా మార్కెట్ యార్డ్ కు వచ్చినప్పటికీ పంటను మాత్రం అధికారులు కొనడం లేదట. అతిగా మాయిశ్చర్ ఉందని, ఇతర కారణాలు చెప్పి పంటను కొనకుండా కాలయాపన చేస్తున్నారట అధికారులు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ గ్రేన్ మార్కెట్ లో సోయాబీన్ పంటను అధికారులు కొనడంలేదని కన్నీరు పెట్టుకున్నారు ఓ రైతు. పంట కొనకపోతే, పురుగుల మందు తాగి చనిపోవడమే తనకు దిక్కు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు రూ.5 లక్షల పెట్టుబడి పెట్టానని, ఇప్పుడు మాయిశ్చర్ ఎక్కువగా ఉందని కొనడం లేదని పేర్కొన్నాడు. వర్షాలు కురవడం వల్లే, మాయిశ్చర్ వస్తే మేమేం చేయాలన్నారు. క్లిక్






