- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళ్లు మొక్కుతా.. బాంచన్ ఒక్క బస్తా యూరియా ఇప్పించండి
రాష్ట్రంలో యూరియా బస్తాల కోసం రైతులు అవస్త పడుతున్నారు. చాలా చోట్ల యూరియా కేంద్రాల వద్ద బస్తాల కోసం ఉదయం నుండి క్యూ కడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో యూరియా బస్తాల కోసం రైతులు అవస్త పడుతున్నారు. చాలా చోట్ల యూరియా కేంద్రాల వద్ద బస్తాల కోసం ఉదయం నుండి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్క యూరియా బస్తా అయినా ఇప్పించాలి అంటూ ఓ రైతు ఏవో కాళ్ల మీద పడి వేడుకున్నాడు. ఈ ఘటన డోర్నకల్ నియోజకవర్గం నర్సింహుల పేట బస్తారాంతండాలో జరిగింది. ఇద్దరు రైతులు తమకు యూరియా బస్తాలు కావాలని ఏవో వద్దకు వెళ్లగా అతడు లేవని సమాధానం ఇచ్చాడు. దీంతో ఎలాగైనా ఇప్పించాలి అంటూ రైతులు కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే యూరియా కొరత తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఓ యాప్ ను కూడా ప్రవేశపెట్టింది. అయితే దేశంలోనే యూరియా కొరత కారణంగా రైతులకు తగినంత సప్లై చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.






