- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్
డ్రగ్స్ సరఫరాదారులు, వాడకందారులపై సైబరాబాద్ పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు.

దిశ, శేరిలింగంపల్లి: డ్రగ్స్ సరఫరాదారులు, వాడకందారులపై సైబరాబాద్ పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. తాజాగా డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. రజనీకాంత్, రాధికా ఆఫ్టే హీరో హీరోయిన్‌లుగా నటించిన ‘కబాలి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు.
కేపీ చౌదరి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్టు తేలడంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నుంచి పోలీసులు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. వారికి ఎవరు సప్లై చేస్తున్నారు. ఇందులో ఎవరెవరు ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ‘కబాలి’ సినిమాలో డ్రగ్స్ సరఫరానే ఇతివృత్తంగా తీసుకుని నిర్మించారు. అదే సినీ నిర్మాత ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం విశేషం.
Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే






