- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందుకే బీజేపీలో చేరాను..! ప్రముఖ సినీ నటి ఆమని కీలక వ్యాఖ్యలు
బీజేపీ పార్టీలో ప్రముఖ సినీ నటి ఆమని చేరింది. శనివారం పార్టీ స్టేట్ ఆఫీస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్న ఆమె.. పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ పార్టీలో ప్రముఖ సినీ నటి ఆమని చేరింది. శనివారం పార్టీ స్టేట్ ఆఫీస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్న ఆమె.. పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో నేడు మేము ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకుంటున్నామని తెలిపారు. భారత దేశం కోసం ఆయన చేస్తున్న ఎన్నో మంచి పనులను చూస్తూ మేము ఆకర్షితులయ్యామని చెప్పారు. అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు సేవ చేయాలని బీజేపీలో చేరానని తెలిపారు. ప్రధాని మోడీ అంటే నాకు భక్తి.. మోడీ నాయకత్వంలో జరుగుతున్న మంచి పనులు చూసి స్ఫూర్తి పొందినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు మాట్లాడుతూ.. చలనచిత్ర నటి ఆమని భారతీయ జనతా పార్టీలోకి హృదయపూర్వక ఆహ్వానం పలికామన్నారు. గౌరవప్రదమైన నటనతో, సామాజిక స్పృహతో ప్రజల మనసు గెలుచుకున్న ఆమని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దార్శనికత, నాయకత్వం పట్ల ఆకర్షితులై, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకోవడం అభినందనీయం అని అన్నారు. తన అనుభవం, ప్రజాదరణతో 'వికసిత భారత్' లక్ష్య సాధనలో ఆమని క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఆకాంక్షించారు.






