- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Janaushadhi: జనఔషధి కేంద్రాలపై తప్పుడు ప్రచారం: ఈటల రాజేందర్
జనఔషధి కేంద్రాలపై తప్పుడు ప్రచారం జరుగుతున్నదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జన ఔషధి సేవలు వినియోగించుకుని మందుల అధిక ఖర్చుల భారం నుండి బయటపడాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) పిలుపునిచ్చారు. కొన్ని మందుల కంపెనీలు, ప్రైవేట్ వ్యాపారులు జనఔషధ కేంద్రాలంలో (JANAUSHADHI Center) నాణ్యమైన మందులు దొరకవని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవన్ని అవాస్తవమన్నారు. ఔషధాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి జనఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుందన్నదనితెలిపారు. ‘జన ఔషధీ దివస్- 2025’ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరిలోని నేరేడ్‌మెట్ క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన వాక్‌లో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పేదరికం తెలిసిన వారే కాబట్టే పేదల కోసం పథకాలు తీసుకువచ్చారన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ 11 ఏళ్లలో పేదలకు అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడంలో మోడీ పాత్ర మాటల్లో చెప్పలేనిదని, అందులో భాగంగా వచ్చిందే జనఔషధీ కేంద్రాలన్నారు.
ఐడీపీఎల్ పునరుద్ధరించాలని కోరా..
సౌత్ ఇండియాలో నాణ్యమైన మందులు అందుబాటులో కావాలంటే ఐడీపీఎల్ (IDPL) కంపెనీని మళ్లీ పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరానని ఈటల చెప్పారు. కెమికల్స్ ఫర్టిలైజర్స్&ఫార్మాసూటికల్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో తాను సభ్యుడినని, 30 మంది పార్లమెంట్ సభ్యులను మూతపడ్డ ఐడీపీఎల్ కంపెనీకి తీసుకెళ్లి వివరించానని వెల్లడించారు.






