Fake News: అడ్లూరిని నేను ఏమీ అనలేదు..! ప్రచారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ

by Ramesh Naini |   (  Updated:2025-10-05 15:04:54  IST  )

సహచర మంత్రి అడ్లూరిపై నేను అనని మాటల్ని అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు.

Fake News: అడ్లూరిని నేను ఏమీ అనలేదు..! ప్రచారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మంత్రులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలస్యంగా వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌(Minister Adluri Lakshman)ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Minister Ponnam Prabhakar) “దున్నపోతు” అని సంబోధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ప్రెస్‌మీట్‌కు ముందు లైవ్‌లో పొన్నం ప్రభాకర్ మంత్రి వివేక్ (Minister Vivek) చెవిలో గుసగుసలు ఆడారు. అక్కడే ఉన్న మీడియా మైక్‌ల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు అస్పష్టంగా వినిపించాయి.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అంశంపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘సహచర మంత్రి అడ్లూరిపై నేను అనని మాటల్ని అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అడ్లూరి లక్ష్మణ్ అంటే మాకెంతో గౌరవం. ఢిల్లీ వెళ్లేందుకు టికెట్స్ ఇంకా కన్ఫార్మ్ కాకపోవడంతో నా సిబ్బందిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ట్వీట్..

Next Story