- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో నకిలీ ఐపీఎస్ హంగామా.. జవాన్లుగా ఇద్దరు రిటైర్డ్ CRPF
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పోలీసులు ‘ఫేక్ ఆఫీసర్’ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పోలీసులు ‘ఫేక్ ఆఫీసర్’ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడి పేరు బత్తిని శశికాంత్ (39). ఇతను ఏపీలోని నందికొట్కూరు సమీపంలోని చంపాపేట గ్రామానికి చెందిన వాడు. 3డీ ఏనిమేషన్ కోర్సు నేర్చుకుని చిన్న కంపెనీ పెట్టుకున్నాడు. ఆ నైపుణ్యాన్నే వాడుకుని తన పేరుతోనే నకిలీ ఐడీ కార్డులు రూపొందించుకున్నాడు.
అతను తనను తాను ఒక్కోసారి ఐఏఎస్‌గా, మరోసారి ఐపీఎస్‌గా, ఇంకోసారి ఎన్‌ఐఏ స్పెషల్ ఆఫీసర్‌గా చెప్పుకుని ప్రజల్ని మోసం చేస్తూ వచ్చాడు. ఇటీవల షేక్‌పేటలోని అపర్ణ ఔరా అపార్ట్‌మెంట్లో ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటున్నాడు. తమిళనాడుకు చెందిన ఇద్దరు రిటైర్డ్ సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రవీణ్, విమల్‌లను డబ్బులిచ్చి తన గన్‌మెన్లుగా నియమించుకున్నాడు. వీరితో కలిసి షేక్‌పేటలోని గోల్డ్ జిమ్‌కి వెళ్లి వర్కౌట్ చేసేవాడు. ఎవరైనా ఫోన్ చేస్తే “స్పెషల్ ఆపరేషన్‌కి వెళ్తున్నా” అంటూ హడావిడిగా బయలుదేరేవాడట. ఇదే జిమ్ యజమాని అలీ హసన్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు. తాను టీఎస్‌ఐఐసీలో డిప్యూటీ డైరెక్టర్‌ని, ఇండస్ట్రీల కోసం భూములు కేటాయించే స్పెషల్ ఐఏఎస్ అధికారినని చెప్పి నమ్మించాడు.
నకిలీ అలాట్‌మెంట్ లెటర్ చూపించి అలీ హసన్ దగ్గర రూ.10.50 లక్షలు, మరో సభ్యుడి దగ్గర రూ.10 లక్షలు కాజేశాడు. అయితే ఆ భూమి తన పేరు మీద రిజిస్టర్ కాకపోవడంతో అలీ హసన్‌కి అనుమానం వచ్చింది. విచారించి ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శశికాంత్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సోదాల్లో రెండు మొబైల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీటాకీలు, పలు నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గన్‌మెన్లుగా వ్యవహరించిన ఇద్దరు రిటైర్డ్ CRPF జవాన్లను కూడా త్వరలో అరెస్టు చేస్తామని పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.






