- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో నకి’లీలలు‘.. అసలే అచ్చు.. కాని అంతా అబద్ధం!
పేరొందిన కంపెనీ ఉత్పత్తులను పోలిన నకిలీ ఉత్పత్తుల విక్రయాలకు నగరం కేరాఫ్ అడ్రస్ గా మారింది . టీ పొడి, నెయ్యి, పాలు , నూనెలు , కిరాణా వస్తువులు, పప్పుదినుసులు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, విద్యుత్ పరికరాలు, టీవీలు,

దిశ , హైదరాబాద్ బ్యూరో: పేరొందిన కంపెనీ ఉత్పత్తులను పోలిన నకిలీ ఉత్పత్తుల విక్రయాలకు నగరం కేరాఫ్ అడ్రస్ గా మారింది . టీ పొడి, నెయ్యి, పాలు , నూనెలు , కిరాణా వస్తువులు, పప్పుదినుసులు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, విద్యుత్ పరికరాలు, టీవీలు, కంప్యూటర్లు, మిక్సీలు, గ్రైండర్లు ఇలా ఒక్కటేమిటీ అన్ని రకాల నిత్యావసరాలను అచ్చు గుద్దినట్లు అసలును పోలిన నకిలీ వస్తువులను తయారి చేసి అమ్ముతూ ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నారు. బడా కంపెనీల లేబుళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్ గా తాము తయారు చేసిన వస్తువులకు వేసి బహిరంగంగా అమ్ముతున్నారు.
ఇది తెలియని కొనుగోలుదారులు అవే ఒరిజినల్ అనుకుని కొని దారుణంగా మోసపోతున్నారు . ఇలాంటి అమ్మకాలకు ప్రముఖ వ్యాపార కేంద్రాలైన బేగంబజార్, ట్రూప్ బజార్ , మహరాజ్ గంజ్ , బ్యాంక్ స్ట్రీట్ ,గుజరాతీగల్లీ, జాంబాగ్ మార్కెట్లు అడ్డాలుగా మారుతున్నాయి. దాడులు చేసి డుప్లికేట్ అమ్మకం దార్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది .అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు సైతం వినబడుతున్నాయి. ఎప్పుడో ఒకసారి తూతూ మంత్రంగా దాడులు చేస్తూ చేతులు దులుపుకుంటుండడంతో నకిలీల బెడద తప్పడం లేదని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు .
విస్తుపోయే నిజాలు..
బేగంబజార్ , మహరాజ్ గంజ్ మార్కెట్లకు అన్ని రకాల వస్తువులు విక్రయించే హోల్ సేల్ మార్కెట్లు గా గుర్తింపు పొందాయి . ఇక్కడ పెద్ద సంఖ్యలో హోల్ సేల్ దుకాణాలు ఉండగా జంటనగరాలతో పాటు జిల్లాల నుండి కూడా కొనుగోలు కోసం వస్తుంటారు. ప్రతినిత్యం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయే మార్కెట్ల లో నిత్యం కోట్లాది రూపాయల విక్రయాలు జరుగుతుంటాయి. ఇంతటి పేరున్న మార్కెట్ల పై అధికారులు దాడులు మరచిపోవడంతో నిర్వాహకులు నకిలీ వస్తువుల విక్రయాలకు తెరలేపారు.
ఈ నేపథ్యంలో అధికారులకు అందిన ఫిర్యాదులతో మార్కెట్ లోని కొన్ని హోల్ సేల్ దుకాణాలపై దాడులు చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. లక్షలాధి రూపాయల నకిలీ గృహాపకరణాలు పట్టుబడడంతో అధికారులు సైతం షాక్ తిన్నారు . వాటిని స్వాధీనం చేసుకున్నారు.
నిలువు దోపిడి..?
నకిలీ వస్తువులు విక్రయించే వ్యాపారులు ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారు. పేరొందిన ఏ కంపెనీ బ్రాండ్ ల పేరుతోనైనా నకిలీవి తయారు చేసి విక్రయించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య . ముఖ్యంగా బ్రాండ్ యజమాని అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా తయారు చేస్తూ నిత్యం లక్షలాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారు . కంపెనీలు తయారు చేసిన అసలు వస్తువుల మాధిరిగానే పేర్లు , లేబుల్స్ ఉంటుండడంతో కొనుగోలుదారులు వీటిని చూసి బోల్తా పడుతున్నారు . దీనికితోడు నకిలీ వస్తువుల తయారీ, విక్రయదారులు డిస్కౌంట్లు , ఆఫర్లు అంటూ మభ్యపెడుతూ బహింరంగ విక్రయాలు చేపడుతున్నారు .
పట్టుబడిన బట్టర్ ఫ్లై నకిలీ ప్రొడక్ట్స్..
నగరంలోని మహారాజ్ గంజ్ లోని ఓ గోదాం ఏర్పాటు చేసుకున్న కిరణ్, బల్ సింగ్ తదితరులు బటర్ ఫ్లై కంపెనీ పేరుతో నకిలీ ప్రోడక్ట్స్ విక్రయిస్తున్నారు . శుక్రవారం ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజిలెన్స్ ఏజెన్సీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో టాస్క్ ఫోర్స్ బృందాలు దాడులు చేపట్టాయి . ఈ సందర్భంగా వారు అసలును పోలిన నకిలీ బటర్ ఫ్లై కంపెనీ లేబుళ్లతో ఉన్న 30 నకిలీ వెట్ గ్రౌండర్లు, 64 ఎల్పీజీ స్టవ్స్ లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు .






