మెడికల్ కాలేజీలలో ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే

by Ajay Maddhiboyina |

మెడికల్ కాలేజీలలో ఫ్యాకల్టీ కి సంబంధించిన అక్రమాలపై దృష్టి సారించిన నేషనల్ మెడికల్ కమిషన్ ఓ నమూనా పత్రాన్ని తయారుచేసింది.

మెడికల్ కాలేజీలలో ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే
X

దిశ తెలంగాణ బ్యూరో: మెడికల్ కాలేజీలలో ఫ్యాకల్టీ కి సంబంధించిన అక్రమాలపై దృష్టి సారించిన నేషనల్ మెడికల్ కమిషన్ ఓ నమూనా పత్రాన్ని తయారుచేసింది. ఇకపై మెడికల్ కాలేజీలన్ని వారి టీచింగ్ ఫ్యాకల్టీ కి సంబంధించిన వివరాలను ప్రతినెల 5వ తారీఖున అప్డేట్ చేయాల్సి ఉంటుందని నాకు మెడికల్ కమిషన్ లోని పాలసీ అండ్ కోఆర్డినేషన్ డివిజన్ స్పష్టం చేసింది. మరోవైపు తప్పుడు సర్టిఫికెట్లతో కూడిన వివరాలు గానీ, లేని ఫ్యాకల్టీని చూపెట్టడం లాంటి ప్రయత్నాలు చేస్తే మెడికల్ కమిషన్ లోని ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, అసెస్మెంట్ అండ్ రేటింగ్ 2023 లోని 9.1, 9.2 రెగ్యులేషన్స్ తోపాటు, మెయింటెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 2023 లోని ఎనిమిదవ రెగ్యులేషన్ ప్రకారం జరిమానా తో పాటు ఇతర చర్యలకు వెనకాడబోమని హెచ్చరించింది.

కాలేజీల సీనియర్ ఫ్యాకల్టీ కూడా.. ఒకవేళ కాలేజీకి చెందిన సూపరిండెంట్, ప్రిన్సిపల్, డీన్ కూడా ఏదైనా టీచింగ్ విభాగానికి చెందినట్లయితే వారి వివరాలను కూడా స్పష్టంగా నమోదు చేయాలని పేర్కొంది.

Next Story