- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో ముఖ గుర్తింపు హాజరు 93.35 శాతం నమోదు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత పాటించేలా పాఠశాల విద్యాశాఖ తన పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు,

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత పాటించేలా పాఠశాల విద్యాశాఖ తన పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఆగస్టు 1 నుంచి ముఖ గుర్తింపు హాజరును అమల్లోకి తీసుకొచ్చింది. విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 24,973 ఉండగా అందులో మొత్తం ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కలిపి 1,28,760 మంది ఉన్నారు. కాగా శుక్రవారం ముఖ గుర్తింపు హాజరు ఆప్ ద్వారా 96,327 (75 శాతం ) మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 89,922 (93.3 శాతం) మంది తమ హాజరును యాప్ ద్వారా నమోదు చేసుకోగా, 6,405 మంది సిబ్బంది హాజరును గుర్తించలేదు. రాష్ట్రంలోని 33 జిల్లాల వారిగా చూస్తే ఆదిలాబాద్ లో 2403 మంది హాజరుతో 96.16 శాతం హాజరుతో మొదటి స్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లాలో 4464 మంది హాజరుతో 95.84 శాతంలో రెండవ స్థానంలో నిలిచాయి. జోగులాంబ గద్వాల్, 1785 ( 95.56 శాతం) మూడవ స్థానం, మహబూబ్ నగర్ లో 3043(95.14 శాతం) మంది హాజరుతో నాల్గవ స్థానం, కుమరం భీం అసిఫాబాద్ జిల్లాలో 1782 మంది హాజరుతో (95.14 శాతం ) వరుసగా 5 స్థానాల్లో నిలిచాయి.
అత్యల్పంగా పెద్దపల్లిలో:
కామారెడ్డి, హైదరాబాద్, నిర్మల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, నాగర్‌కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, మెదక్, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ హాజరు శాతం 90 శాతానికి పైగా నమోదైంది. కాగా పెద్దపల్లి జిల్లాలో 1944 మంది తో( 74.57 శాతంతో) అన్నింటికంటే తక్కువగా నమోదైంది.
ఎఫ్ఆర్ఎస్ వివరాల ప్రకారం జిల్లాల వారీగా:
మొత్తం పాఠశాలలు: 24,973
ప్రారంభించిన పాఠశాలలు: 24,951
ప్రారంభించని పాఠశాలలు: 22






