- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gandhi Bhavan: గాంధీభవన్‌లో మళ్లీ ‘ప్రజలతో ముఖాముఖి’
by Ramesh Naini |
కొంతకాలంగా వాయిదాపడిన గాంధీభవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం తిరిగి రేపటి నుంచి ప్రారంభం కానున్నది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : కొంతకాలంగా వాయిదాపడిన గాంధీభవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం తిరిగి రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్ ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతంలో ప్రతి బుధవారం గాంధీభవన్ లో ప్రజలతో ముఖాముఖిలో కార్యక్రమంలో మంత్రులు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు, సమస్యలపైన సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టేవారు. ఈ కార్యక్రమం అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా మారింది. అలాగే కార్యక్రమానికి మంచి ప్రజా స్పందన లభించింది. అయితే కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభం కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






