Girl death : కంటి ఆసుపత్రి నిర్వాకం..చిన్నారి మ‌ృతి

by Y. Venkata Narasimha Reddy |

ఓ కంటి ఆసుపత్రి(Eye hospital) పొరపాటు ఓ చిన్నారి ప్రాణాలు(Girl death) తీసింది.

Girl death : కంటి ఆసుపత్రి నిర్వాకం..చిన్నారి మ‌ృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ కంటి ఆసుపత్రి(Eye hospital) పొరపాటు ఓ చిన్నారి ప్రాణాలు(Girl death) తీసింది. చిన్నారి అన్విక(5)ను కంటిలో నలక పడిందని తల్లిదండ్రులు చికిత్స కోసం హైదరాబాద్ ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కంటిలో నలకను తీసేయాలంటే సర్జరీ చేయాలని ఆసుపత్రి వైద్యులు సూచించారు. సర్జరీ చేసే ముందు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అన్విక గుండె ఆగిపోయింది. వైద్యులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా చిన్నారిని ఎల్బీనగర్ రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌కు తరలించారు.

అక్కడి వైద్యులు అన్వికను పరీక్షించి అప్పటికే చనిపోయినట్లుగా చెప్పడంతో తల్లిదండ్రులు బోరుమన్నారు. తమ కూతురు ప్రాణాలు తీసిన ఆనంద్ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలంటూ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Next Story