- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ KMC వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సైఫ్‌ను ఉరితీయాలని ఏబీవీపీ డిమాండ్
by Malleboina Mahesh |
వరంగల్ కేఎంసీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెడికో ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన నేపథ్యంలో వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల వద్ద ఏబీవీపీ సభ్యులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్ కేఎంసీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెడికో ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన నేపథ్యంలో వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల వద్ద ఏబీవీపీ సభ్యులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం కేఎంసీ గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రీతికి న్యాయం చేయాలని కోరారు.
ప్రీతిని వేధించిన నిందితుడు సైఫ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు...నిరసనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో కేఎంసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Next Story






