- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లో నమోదవ్వగా.. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పటాన్ చెరులో 8, ఆదిలాబాద్ లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. నగరంలో ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. నిలువనీడ లేక ఫుట్ పాత్ లపై పడుకునే వారి పరిస్థితి అయితే దయనీయంగా మారింది. ఎవరైనా బెడ్ షీట్లు దానం చేయకపోతారా అని దీనంగా ఎదురుచూస్తున్నారు. దుండిగల్ లో 13, హయత్ నగర్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈనెల 21 వరకూ చలితీవ్రత తీవ్రస్థాయిలో ఉంటుందని, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7-9 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో నాలుగు రోజులపాటు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఏపీలోనూ చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అరకు వ్యాలీ, ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. లంబసింగి, అరకు, పరిసర గ్రామాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. 2 నుంచి 5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.






