TGPSC : ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

by Muthe.Rajitha |

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) మరో ఫలితాలను విడుదల చేసింది.

TGPSC : ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) మరో ఫలితాలను విడుదల చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. మహిళా, శిశు సంక్షేమశాఖ విభాగంలో గ్రేడ్ 1 ఎక్స్‌టెన్షన్(Grade 1 Extenion Officer) ఆఫీసరు పోస్టుల భర్తీకి గత జనవరి 8న పరీక్ష నిర్వహించారు. మొత్తం 181 పోస్టులకు గాను 26,751 మంది దరఖాస్తు చేసుకోగా.. 16,729 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు చెందిన మెరిట్ జాబితా(Merit List)ను నేడు టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 15,280 మంది ఈ లిస్టులో ఉన్నారు. 1:2 రేషియోలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు అభ్యర్థులను పిలవనున్నారు. కాగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను కమిషన్ తన అధికారక వెబ్సైట్ లో ఉంచింది. ఫలితాల కోసం https://www.tspsc.gov.in/ లోకి లాగిన్ అవండి.

Next Story