- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు వేసవి సెలవులు పొడిగింపు.. మాకు ఇవ్వాలని జూ. లెక్చరర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన జూనియర్ కాలేజీలను ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ 8 కి వాయిదా వేయాలని లెక్చరర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎండలు సుర్రుమంటున్నాయి. ఉదయం 10 గంటలకే అడుగు బయటపెట్టని పరిస్థితి ఉంది. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటిపోతోంది. తీవ్రమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 31తో ముగియాల్సిన వేసవి సెలవులు జూన్ 6 వ తేదీ 2026 వరకు పొడిగించారు. తిరిగి జూన్ 8 వ తేదీన కళాశాలల్లో నూతన విద్యా సంవత్సరం యథావిధిగా ప్రారంభం అవుతుందని యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.
జూనియర్ కాలేజీలు వాయిదా వేయాలి:
మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ జూనియర్ కళాశాలల పునఃప్రారంభాన్ని కూడా వాయిదా వేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీ నుండి జూనియర్ కాలేజీలు తెరవాల్సి ఉండగా విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పునఃప్రారంభాన్ని జూన్ 1 నుండి జూన్ 8, 2026కి రీషెడ్యూల్ చేయాలని గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ కోరుతోంది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ విజ్ఞప్తిపై ప్రభుత్వం నుండి స్పందన రాగానే తదుపరి సమాచారాన్ని తెలియజేస్తామని అసోసియేషన్ పేర్కొంది.






