కృష్ణా స్టేషన్‌లో ఎక్స్‌ ప్రెస్ రైళ్ల హాల్టింగ్

by Elthuri vijay kumar |

రైళ్ల హాల్టింగ్ కు కేంద్ర రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్

కృష్ణా స్టేషన్‌లో ఎక్స్‌ ప్రెస్ రైళ్ల హాల్టింగ్
X

కృష్ణా స్టేషన్‌లో ఎక్స్‌ ప్రెస్ రైళ్ల హాల్టింగ్

- రైళ్ల హాల్టింగ్ కు కేంద్ర రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్

- ఐదేళ్ల పోరాటానికి దక్కిన విజయఫలం!

- ప్రధాని మోడీ, ఎంపీ డీకే అరుణ చిత్రపటాలకు బీజేపీ, అఖిలపక్ష నేతల పాలాభిషేకం

దిశ, మక్తల్: ఎట్టకేలకు కృష్ణా రైల్వే స్టేషన్‌కు పూర్వ వైభవం తిరిగి రానుంది. ఐదేళ్ల పోరాటం తర్వాత కేంద్ర రైల్వే శాఖ మూడు ఎక్స్‌ ప్రెస్ రైళ్లు కృష్ణా స్టేషన్‌లో హల్ట్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణమ్మ చిత్రపటాలకు బీజేపీ నేతల ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు పాలాభిషేకం చేసి విజయోత్సవాలు నిర్వహించారు. బుధవారం నుంచి 11014 కోయంబత్తూర్–లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్, 22159 ముంబై–చెన్నై ఎక్స్‌ప్రెస్, 22160 చెన్నై–ముంబై ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రతిరోజూ కృష్ణా స్టేషన్‌లో నిలవనున్నాయి. కరోనా కారణంగా 2019లో రద్దు చేసిన ఈ స్టాప్‌లను మళ్లీ పునరుద్ధరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైళ్లు నిలవడంతో ప్రయాణికులకు సౌలభ్యం కలగడంతో పాటు, వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, కృష్ణానది తీరానికి వచ్చే భక్తులకు కూడా మేలు కలగనుంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఎంపీ డీకే అరుణ ఇచ్చిన హామీకి న్యాయం జరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా గ్రామస్థులు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు, వినతులకు ఇప్పుడు ఫలితం దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా స్టేషన్‌లో జరిగిన కృతజ్ఞత సభలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అమరకుమార్ దీక్షిత్, మాజీ జిల్లా అధ్యక్షుడు నల్లే నరసప్ప, బలరాం రెడ్డి, జయనంద్ రెడ్డి, సోమశేఖర్ గౌడ్, కర్నే స్వామి, ఆర్. వెంకటేష్ తదితర బీజేపీ నాయకులు, అఖిలపక్ష ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story