గాంధీలో గడువు తీరిన మందుల కేసు...నిందితులకు జరిమానా

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-17 17:25:40  IST  )

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 2014-15లో గడువు ముగిసిన మందులు వాడిన కేసులో హెచ్చార్సీ కీలక తీర్పు వెలువరించింది.

గాంధీలో గడువు తీరిన మందుల కేసు...నిందితులకు జరిమానా
X

దిశ తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 2014-15లో గడువు ముగిసిన మందులు వాడిన కేసులో హెచ్చార్సీ కీలక తీర్పు వెలువరించింది. గాంధీ ఆసుపత్రిలో 2014-15లో గడువు ముగిసిన హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వడంతో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు హెచ్చార్సీ కి ఫిర్యాదు చేయడంతో... కేసు విచారణ చేపట్టి, నేడు తీర్పు వెలువరించింది. బాధితులైన ఎ.ఎన్. ఆదిలక్ష్మి, ఎస్. దేవమణి, టి. సతీష్, పి. మల్లికార్జున్, టి. రవి, జి. ధనుంజయ్ లకు ఒక్కొక్కరికి రూ. 1,25,000 పరిహారం చెల్లించాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు. ఈ ఘటన ఆరోగ్య సంస్థలో వ్యవస్థాగత వైఫల్యాలను బహిర్గతం చేసిందని, బాధితుల హక్కులను ఉల్లంఘించిందని హెచ్చార్సీ తెలిపింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో సహా బాధ్యులపై చర్యలకు ఆదేశిస్తూ... ఔషధ నిర్వహణలో కఠిన మార్గదర్శకాలను రెండు నెలల్లో అమలు చేయాలని సూచించారు. హెచ్చార్సీ ఆదేశాలతో ఘటనకు కారణమైన వైద్యురాలిని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సస్పెండ్ చేసారు.

Next Story