- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిగాచి ప్రమాదంపై సీఎస్‌కు నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ
పాశమైలారం సిగాచి ప్రమాదంపై సీఎస్‌కు నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. అగ్ని ప్రమాదాలపై సిగాచీ కంపెనీ రక్షణ చర్యలు తీసుకోలేదని నివేదికలో కమిటీ స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: పాశమైలారం సిగాచి ప్రమాదంపై సీఎస్‌కు నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. అగ్ని ప్రమాదాలపై సిగాచీ కంపెనీ రక్షణ చర్యలు తీసుకోలేదని నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. సిగాచి ప్రమాదం తరవాత రాష్ట్ర వ్యాప్తంగా ఇండిస్ట్రియల్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఇండస్ట్రీయల్ ఏరియాలోనే అగ్నిమాపక నియంత్రణ యంత్రాలను ఏర్పాటు చేయాలని నివేదికలో కమిటీ స్పష్టం చేసింది.
ఆయా కంపెనీల్లో పనిచేసే వలస కార్మికుల వివరాలను కార్మికశాఖ ముందే ఉండాలని కమిటీ పేర్కొంది. ఇదిలా ఉంటే పాశమైలారం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మొత్తం 45 మంది మరణించగా 8 మంది ఆచూకీ అసలు లభించనే లేదు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ఉండేందుకు, కంపెనీపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది.






