- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవితకు బదులు కేసీఆర్‌కు నోటీసులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలేం జరుగుతోంది?
ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) మరింత ఉత్కంఠ రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్‍కు సంబంధించిన విచారణలో తాజాగా సంచలనం నమోదు అయింది. నిన్నా మొన్నటి వరకు అధికారులు, ఆయా పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించిన సిట్ (SIT) అధికారులు ఇవాళ గత ప్రభుత్వాధినేత, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‍కు (KCR) నోటీసులు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం విచారిస్తామని ఇందుకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంత వరకు బాగానే ఉన్న కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం వెనుక మరో అంశం చర్చకు వస్తోంది. హరీశ్ రావు, కేటీఆర్, సంతోశ్ రావులను విచారించిన సిట్ వీరి తర్వాత కేసీఆర్ కూతురు, మాజీ ఎమ్మెల్సీ కల్వుకుంట్ల కవిత (Kavitha) ఆమె భర్త అనిల్‍కు నోటీసులు ఇవ్వబోతోందనే ప్రచారం జరిగింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా కేసీఆర్ పై ఫోకస్ పెట్టడంతో ఈ కేసులో ఏం జరుగుతోంది? అసలేం జరగబోతోందనే చర్చ జోరందుకుంది.
కవిత చుట్టూ చర్చ:
ఇప్పటి వరకు వెల్లడైన అంశాలు, బాధితుల వాంగ్మూలాలు, అరెస్ట్ అయిన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా అధికారులు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని కల్వకుంట్ల కవిత చాలా సందర్భాల్లో బహిరంగంగానే కామెంట్స్ చేశారు. దీంతో హరీశ్ రావు, కేటీఆర్, సంతోశ్ రావు అనంతరం కవిత లేదా ఆమె భర్తకు నోటీసులు వెళ్లబోతున్నాయనే వీరి విచారణ అనంతరం కేసీఆర్‍ను ప్రశ్నిస్తారనే ప్రచారం జరిగింది. వీరిచ్చే వాంగ్ములం కేసుకు బంలంగా మారబోతోందనే చర్చ సర్వత్రా వినిపించింది. కానీ దర్యాప్తు అధికారులు మాత్రం కవితకు కానీ ఆమె భర్తకు కానీ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కేసీఆర్‍ను విచారణకు పిలవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యంలోకి నెట్టుతోంది. దీంతో తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని బహిరంగంగా ఆరోపించినప్పటికీ కవిత ఆరోపణలు సిట్ అధికారులు లైట్ తీసుకుంటున్నారా? లేక ఆ దిశగా వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదా? దర్యాప్తు బృందం ఎందుకు కవితకు నోటీసులు ఇవ్వలేదు అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కేసీఆర్‍తో ముగుస్తుందా?:
ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చి 10 నుంచి సుదీర్ఘ కాలంగా దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ఇటీవల సిటీ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 9 మందితో కూడిన రెండో సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఏర్పాటు అయ్యాక ముఖ్య నేతలే టార్గెట్ గా విచారణలో స్పీడు పెంచింది. ఇక తాజాగా కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో ఇక్కడితో విచారణ ముంగించి పైనల్ చార్జిషీట్ దాఖలు చేయబోతున్నారా లేక ఇంకెవరినైనా విచారించబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.






