ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఆ పార్టీ వైపే..?

by Disha Web |
ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఆ పార్టీ వైపే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : హోరాహోరీ ప్రచారం.. ఆద్యంతం ఉత్కంఠగా మారిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికపై వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవనున్నట్లు వెల్లడైంది. రెండో స్థానంలో బీజేపీ, మూడో ప్లేస్‌లో కాంగ్రెస్ ఉంటాయని అంచనా వేశాయి. సిట్టింగ్ స్థానమైనా అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్‌కు మూడో స్థానాన్నే ఇచ్చాయి. మునుగోడులోని 298 కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిగణనలోకి తీసుకుని అంచనా ఫలితాలను వెల్లడించాయి. పబ్లిక్ పల్స్, ఆత్మసాక్షి, కౌటిల్య, హెచ్ఎంఆర్, త్రిశూల్, థర్డ్ విజన్.. ఇలాంటి దాదాపు పది సంస్థలు పోలింగ్ ట్రెండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఎగ్జిట్ పోల్ అంచనాలను విడుదల చేశాయి. దాదాపు అన్ని సంస్థల అంచనాల్లో, గెల్చుకునే ఓట్ల శాతంలో స్వల్ప తేడాలున్నా పార్టీలవారీగా మాత్రం టీఆర్ఎస్‌దే గెలుపు అని ఖరారు చేశాయి.

మునుగోడులో 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ తరహాలోనే తాజా ఉప ఎన్నికలోనూ పోలింగ్ గణనీయంగా నమోదైంది. పోలింగ్ సమయం సాయంత్రం ఆరు గంటలకే పూర్తయినా భారీ సంఖ్యలో ఓటర్లు క్యూలలో నిల్చుండడంతో కొన్ని చోట్ల రాత్రి తొమ్మిది గంటల వరకూ కొనసాగింది. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ సరళికి అనుగుణంగానే అంచనా ఫలితాలను సర్వే సంస్థలు ప్రకటించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తున్నారని, రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఉంటారని పేర్కొన్నాయి. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం గెలుపు తమదేననే ధీమాతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వాస్తవాన్ని ప్రతిబింబించవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి సర్వే సంస్థలు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ను ఉదయం నుంచి సాయంత్రం వరకు అధ్యయనం చేశాయి. తొలిసారి కొన్ని సర్వే సంస్థలు మునుగోడులో ప్రత్యక్షమయ్యాయి. ప్రతిసారీ కొన్ని ప్రైవేటు టీవీ ఛానెళ్ళు సర్వే చేస్తుండగా మునుగోడు ఉప ఎన్నికపై మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఎస్ఏఎస్ (ఆత్మసాక్షి) :

టీఆర్ఎస్ : 41%- 42%

బీజేపీ : 35%-36%

కాంగ్రెస్ : 16.5%- 17.5%

బీఎస్పీ : 4%-5%

----

పీపుల్స్ పల్స్:

టీఆర్ఎస్ : 44.4%

బీజేపీ : 37.3%

కాంగ్రెస్ : 12.5%

ఇతరులు : 5.8%

---

హెచ్ఎంఆర్ :

టీఆర్ఎస్ : 42.13%

బీజేపీ : 31.98%

కాంగ్రెస్ : 21.06%

ఇతరులు : 4.83%

---

త్రిశూల్ :

టీఆర్ఎస్ : 47%

బీజేపీ : 31%

కాంగ్రెస్ : 18%

ఇతరులు : 4%

----

థర్డ్ విజన్ :

టీఆర్ఎస్ : 48%-51%

బీజేపీ : 31%-35%

కాంగ్రెస్ : 13%-15%

బీఎస్పీ : 5% -7%

----

పల్స్ టుడే :

టీఆర్ఎస్ : 42%-43%

బీజేపీ : 38.5%

కాంగ్రెస్ : 14%-16%

బీఎస్పీ : 3%

---

కౌటిల్య :

టీఆర్ఎస్ : 44.62%

బీజేపీ : 39.26%

కాంగ్రెస్ : 9.12%

ఇతరులు : 7%

---

తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక :

టీఆర్ఎస్ : 40.9%

బీజేపీ : 31%

కాంగ్రెస్ : 23%

బీఎస్పీ : 3.2%

----

స్మార్ట్ పొలిటికల్ రీసెర్చ్ :

టీఆర్ఎస్ : 43.5%

బీజేపీ : 35.3%

కాంగ్రెస్ : 14.7%

ఇతరులు : 6.5%


ఫ్లాష్.. ఫ్లాష్.. కేసీఆర్ సంచలన నిర్ణయం..ఫామ్ హౌస్ వీడియోను విడుదల చేసిన సీఎం
Next Story

Most Viewed