- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ ఫలితాలకు దగ్గరగా సర్వే అంచనాలు
జూబ్లీహిల్స్ ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవాలకు చెంతనే నిలిచాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవాలకు చెంతనే నిలిచాయి. 8 సర్వే సంస్థలు కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని ప్రకటించగా, కేవలం ఒకే ఒక సంస్థ మాత్రమే బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఫలితాలను వెల్లడించింది. ఈ నెల 11 జూబ్లీహిల్స్ జై పోల్ పోలింగ్ జరిగింది. చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్ పోల్, ఆత్మసాక్షి, పీపుల్ పల్స్, హెచ్ఎంఆర్ సర్వే, పల్స్ టుడే, పీఆర్ ఎవర్, ఆరా సంస్థలు చేసిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి నవీన్‌కుమార్ యాదవ్ గెలుపొందుతారని చెప్పాయి.
అయితే.. కేవలం ఒకే ఒక సంస్థ మిషన్ చాణక్య మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆధిక్యం లభిస్తుందని వెల్లడించింది. అన్ని సంస్థలు కూడా కాంగ్రెస్‌కు 46 శాతం నుంచి 48 శాతానికి పైగా ఓట్లు వస్తాయని వెల్లడించాయి. అయితే.. వాటికి భిన్నంగా కాంగ్రెస్ మాత్రం 51 శాతం ఓట్లు సాధించి విన్నింగ్‌గా నిలిచింది. బీఆర్ఎస్‌కు 39 నుంచి 43 శాతం వరకు ఓట్లు వస్తాయని చెప్పినా 38 ఓట్లు లభించాయి. ఇక బీజేపీకి 8 శాతానికి మించబోవని అన్ని సర్వే సంస్థలు తేల్చాయి. అవి చెప్పినట్లుగానే 8 శాతం ఓట్లతో ఆ పార్టీ పరిమితమైంది.






