చిరంజీవితో ముగిసిన ఎగ్జిబిటర్ల సమావేశం.. రెండ్రోజుల్లో కీలక ప్రకటన?

by Naga Rani Yarlagadda |

పెద్ది సినిమా నుంచే తమకు పర్సంటేజి విధానాన్ని అమలు చేసే విషయంపై.. చర్చించేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయింది.

చిరంజీవితో ముగిసిన ఎగ్జిబిటర్ల సమావేశం.. రెండ్రోజుల్లో కీలక ప్రకటన?
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్ది సినిమా నుంచే తమకు పర్సంటేజి విధానాన్ని అమలు చేసే విషయంపై.. చర్చించేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయింది. ఈ భేటీలో పర్సంటేజి విధానంతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు, రెంటల్ విధానంలో తాము చూస్తున్న నష్టాలను గురించి అసోసియేషన్ చర్చించింది. అలాగే పర్సంటేజిపై తమ నిర్ణయాలను ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, కేఎల్ నారాయణ, నిర్మాత దిల్ రాజు చిరంజీవికి వివరించారు. దాదాపు గంట సమయంపాటు ఈ సమావేశం కొనసాగింది. సమావేశం ముగిసిన అనంతరం చిరంజీవి గిల్డ్ నిర్మాతలకు ఫోన్ కాల్ చేసి పిలిచారు. కాసేపటిలో గిల్డ్ నిర్మాతలంతా చిరంజీవి ఇంటికి చేరుకుని, ఆయనతో సమావేశం కానున్నారు. ఎగ్జిబిటర్ల సమావేశం ముగిసిన తర్వాత.. నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. చిరంజీవితో సమావేశం అనంతరం ఎగ్జిబిటర్లంతా సంతోషంగా ఉన్నామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యను ఆయన అర్థం చేసుకున్నారని, రెండ్రోజుల్లో ఎగ్జిబిటర్ల సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేలా నిర్ణయం వెల్లడిస్తానని చిరంజీవి హామీ ఇచ్చారని దిల్ రాజు చెప్పారు. ఎగ్జిబిటర్ల డిమాండ్లపై ఫిలిం చాంబర్ ఇప్పటికే ఒక కమిటీ వేసిందని, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును చిరంజీవి తెప్పించుకుంటారని తెలిపారు. మరోవైపు రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సినీ నిర్మాతలు భేటీ కానున్నారు. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు.. పర్సంటేజీ విధానంపై కూడా చర్చించనున్నారు. ఇటీవలే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిత్రపరిశ్రమ ఉనికిపై కీలక వ్యాఖ్యలు చేయగా.. పవన్ తో నిర్మాతలు సమావేశం కానుండటం చర్చనీయాంశంగా మారింది.

Next Story