- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ బ్రాహ్మణులకు అదిరిపోయే శుభవార్త !
by velandi.Saikiran |
తెలంగాణ బ్రాహ్మణులకు అదిరిపోయే శుభవార్త అందింది. రాబోయే రోజుల్లో తెలంగాణ బ్రాహ్మణులకు మరిన్ని నిధులు ఇస్తామని హామీ

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బ్రాహ్మణులకు అదిరిపోయే శుభవార్త అందింది. రాబోయే రోజుల్లో తెలంగాణ బ్రాహ్మణులకు మరిన్ని నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ గౌలిదొడ్డిలోని బ్రాహ్మణ సదనంలో సెంటర్ ఫర్ బ్రాహ్మిణ్ ఎక్స్ లెన్స్(సీబీఈ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి శ్రీధర్ బాబు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ విషయంలో కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి శ్రీధర్ బాబు... సంస్థ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
Next Story






