బెంగళూరుకి సీఎం రేవంత్ రెడ్డి.. కర్ణాటక కాంగ్రెస్ పరిణామాల నేపథ్యంలో సీఎం టూర్ పై ఉత్కంఠ

by Ramesh Naini |

సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకి వెళ్లారు. శనివారం రాత్రి ఆయన శంషాబాద్​ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకి చేరుకున్నారు.

బెంగళూరుకి సీఎం రేవంత్ రెడ్డి.. కర్ణాటక కాంగ్రెస్ పరిణామాల నేపథ్యంలో సీఎం టూర్ పై ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకి వెళ్లారు. శనివారం రాత్రి ఆయన శంషాబాద్​ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకి చేరుకున్నారు. ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్​లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం బెంగళూరు టూర్ ఉత్కంఠగా మారింది. కర్ణాటకలో సీఎం పదవి కోసం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకొన్న రాజకీయ పరిణామాల క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి అధిష్టానం ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లి పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు జరుపనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. సీఎం రేవంత్ రెడ్డి నేడు పుట్టపర్తికి వెళ్లనున్నారు. ఉదయం పుట్టపర్తిలో ఆయన శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.

Next Story