కల్లు కంపౌండ్లపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం

by Muthe.Rajitha |

తెలంగాణలో అక్రమ, కల్తీ కల్లు వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతోంది రాష్ట్ర ఎక్సైజ్ శాఖ.

కల్లు కంపౌండ్లపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో అక్రమ, కల్తీ కల్లు వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతోంది రాష్ట్ర ఎక్సైజ్ శాఖ. ఇటీవల కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆబ్కారీ శాఖ కల్లు కాంపౌండ్లపై స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) వీ.బీ. కమలాసన్ రెడ్డి నేతృత్వంలోని ఈ డ్రైవ్‌లో భాగంగా టాస్క్ ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పలు కల్లు కాంపౌండ్లపై తనిఖీలు నిర్వహించి, అక్రమ రవాణా, కల్తీ కల్లు తయారీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ స్పెషల్ డ్రైవ్ లో లైసెన్స్ లేని కల్లు కాంపౌండ్లను సీజ్ చేయడం, అక్రమంగా కల్లు రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం, కల్తీ కల్లు తయారీలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, కల్లు దందాలో పనిచేస్తున్న సిండికేట్ వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే మూడు కల్లు కాంపౌండ్లపై కేసులు నమోదు చేయగా, ముషీరాబాద్‌లో అనుమతులు లేని ఒక కల్లు కాంపౌండ్‌ను సీజ్ చేశారు. ఈ డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా కల్లు తయారీ కేంద్రాలు, అక్రమ రవాణాపై నిఘా పెట్టారు.

Next Story