సారాపై ఎక్సైజ్‌శాఖ సమరం

by Muthe.Rajitha |

నాటుసారా నిర్మూలనకు నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ర్ట ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నది.

సారాపై  ఎక్సైజ్‌శాఖ సమరం
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాటుసారా నిర్మూలనకు నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ర్ట ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నది. 13 జిల్లాలో 25 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించడానికి ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకు సర్యులర్లు జారీ చేశారు. నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించాలని ఆదేశించారు. గతంలో మూడు నెలల్లో జరిపిన ప్రత్యేక దాడులతో చాలావరకు నాటుసారా అమ్మకాలు తగ్గాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియజేశారు.

సారా ప్రభావిత ప్రాంతాలు

సారా ప్రభావిత ప్రాంతాలుగా మంచిర్యాల జిల్లాలో చెన్నూర్‌, లక్షెట్టిపేట, బెల్లంపల్లి మండలాలు గుర్తింపు పొందాయి. వనపర్తి జిల్లాలో వనపర్తి, కొత్తకోట ప్రాంతాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అచ్చంపేట, తెలకపల్లి, కల్వకుర్తి మండలాలు నాటు స్థావరాలుగా గుర్తించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో పరకాల, నర్సంపేట, వర్థన్నపేట, మహబూబాబాద్‌ జిల్లాలో తొర్రూర్‌, మహబూబాబాద్‌, గూడేరు, భూపాల్‌పల్లి జిల్లాలో ములుగు, కాటారం, భూపాల్‌పల్లి, నల్లగొండ జిల్లాలో దేవరకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, మహబూబ్‌నగర్‌ జిల్లా, పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్‌, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, నిర్మల్‌ జిల్లాలో పలు మండలాల్లో దాడులు నిర్వహించాలని ఎక్సయిజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

రోజువారీ నివేదికలు

నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాలతోపాటు ముడిసరుకు అక్రమ రవాణా, సప్లయర్స్‌, నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, అల్లం తదితర వాటిన సరఫరా చేసే నిందితుల సమాచారాన్ని సేకరించాలని ఎక్సయిజ్ శాఖ అధికారులు సూచించారు. నాటుసారా ప్రభావిత స్టేషన్ల సీఐలు, ఇన్‌చార్జీలతోపాటు డీటీఎస్, ఎస్‌టీ‌ఎఫ్ టీమ్‌ల సహకారంతో నాటుసారా లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అవసరమైన చోట పోలీసుల సహకారం తీసుకొని దాడులు కొనసాగించాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, ఏఈఎస్‌లు, సీఐలు పర్యవేక్షణలో.. నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు జరగాలని నిర్దేశించారు.

నాటుసారా నిర్మూలనే లక్ష్యం

మొదటిసారి దాడుల్లో నాటుసారా, బెల్లం, అల్లం తదితర వాటిని పట్టుకోవడంతోపాటు బెల్లం సరఫరా ముఠాల గుట్టును రట్టు చేశాం. ప్రభుత్వం నాటుసారాను పూర్తిగా నిర్మూలించాలనే అదేశాలతో మరో నెల రోజులపాటు స్పెషల్‌ డ్రైవ్‌ ప్రణాళికలు తయారు చేశారు. ఈ దాడులు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణా అరికట్టే దిశగా దాడులు కొనసాగుతాయి అని న్‌ఫోర్స్‌మెంట్ ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు.


Next Story