మఠంపల్లి బ్లాక్ షాడో ఎవరు..?

by Gantepaka Srikanth |

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలో అధికార పార్టీ నాయకుడు షాడోగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

మఠంపల్లి బ్లాక్ షాడో ఎవరు..?
X

దిశ హుజూర్ నగర్/మఠంపల్లి: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలో అధికార పార్టీ నాయకుడు షాడోగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆయనను మఠంపల్లి బ్లాక్ షాడోగా అభివర్ణిస్తూ కొందరు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతూ హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది హుజూర్ నగర్ నియోజకవర్గంలో హాట్ న్యూస్‌గా మారింది. ఆ రాజకీయ నాయకుడి ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ప్రభుత్వ పథకాలు ఏది వచ్చినా.. ఆయనది హవా అంటూ.. ప్రతి పనిలోనూ ముడుపులు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్‌లో కూడా లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తాడని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ఈయన కనుసన్నల్లో మట్టి, బొగ్గు, ఇసుక, భూమాఫియా నడుస్తున్నాయి. అధికారులు కూడా ఆయనకి వత్తాసు పలుకుతున్నారని, ఆయన అరాచకాలకు అక్రమ సంపాదనకు ఎవరైనా అడ్డు వస్తే తనకు మంత్రి అండదండలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడతారని సమాచారం.

ప్రస్తుతం ఆయనకు ఏ పదవీ లేదని.. పేదలకు చెందిన ప్రభుత్వ భూములను తన బంధువుల పేరిట పట్టాలు చేయించుకొని అడ్డు వచ్చిన నిరుపేద బాధితులపై దాడులు చెప్పిస్తున్నాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ అరాచకానికి మంత్రి పేరును దుర్వినియోగం పరుస్తూ మంత్రికి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న.. ఈ బ్లాక్ షాడోపై చర్యలు తీసుకుంటారా..? కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Next Story