- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Secretariat: సెక్రటేరియట్ వద్ద ఉరితాళ్లతో మాజీ సర్పంచ్ ల ఆందోళన
పెండింగ్ బిల్లుల కోసం తాజా మాజీ సర్పంచ్ లు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు నిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సెక్రటేరియట్ (Secretariat) వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పెండింగ్ బిల్లులు (Pending bills) చెల్లించాలనే డిమాండ్ తో 'చలో సెక్రటేరియట్' కు మాజీ సర్పంచ్ లు పిలుపు ఇచ్చారు. సర్పంచుల సంఘం (Telangana Sarpanchus Association) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాజా మాజీ సర్పంచ్ లు ఇవాళ ఉదయం సచివాలయం ఎదుట చేరుకుని ధర్నాకు ప్రయత్నించారు. నిరసన కార్యక్రమం నేపథ్యంలో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు పలువురు మాజీ సర్పంచ్ లను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ సర్పంచ్ లు మా పదవీకాలం ముగిసి 13 నెలలు గడుస్తున్నా మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యపై సీఎం, మంత్రులు, అధికారులకు అనేక సందర్భాల్లో వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదని ఇక తమకు చావే శరణ్యం అంటూ ఉరితాళ్లను మెడకు చుట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ బిల్లులు ఇవ్వాలని ఓ మహిళా మాజీ సర్పంచ్ కంటతడి పెట్టుకున్నారు.






