కేసీఆర్ ది దొంగ దీక్ష అంటారా? మహేశ్ కుమార్ గౌడ్‌పై వినోద్ కుమార్ ఫైర్

by Ajay Maddhiboyina |

టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ కార్య‌క్ర‌మంలో వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..

కేసీఆర్ ది దొంగ దీక్ష అంటారా? మహేశ్ కుమార్ గౌడ్‌పై వినోద్ కుమార్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ కార్య‌క్ర‌మంలో వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మ‌హేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ ది దొంగ దీక్ష అని అన్నాడ‌ని మండిప‌డ్డారు. చ‌రిత్ర‌లోని రెండు మూడు ఘ‌ట్టాలు తెలుసుకుంటే అర్థం అవుతుంద‌ని అన్నారు. నిందించే వారు ఆనాడు గాంధీజీ కాలంలో ఉన్నారు.. ఇప్పుడు కేసీఆర్ కాలంలోనూ ఉన్నార‌ని అన్నారు.

ఉప్పు స‌త్యాగ్ర‌హం స‌మ‌యంలో స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం నుండి గాంధీజీ పారిపోయాడ‌ని విమ‌ర్శించార‌న్నారు. స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం క‌ట్టడానికి చందాలు తీసుకుని వాటిని తిరిగి ఇవ్వ‌కుండా గాంధీ పారిపోయాడ‌ని ప్ర‌చారం చేశార‌ని చెప్పారు. అప్పుడు కూడా ఇలాంటి శ‌క్తులే నింద‌లు వేశాయ‌న్నారు. తెలంగాణ వ‌చ్చుడో కేసీఆర్ స‌చ్చుడో అని కేసీఆర్ అన్నార‌ని, దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చుడో నేను స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మానికి వ‌చ్చుడో అని గాంధీజీ అన్నార‌ని చెప్పారు. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో కూడా కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని విమ‌ర్శించారని చెప్పారు.

Next Story